104 సేవలు ప్రభుత్వమే నిర్వహించాలి

104 సేవలు ప్రభుత్వమే నిర్వహించాలి

user-default | Mob: | 27 Oct

కాకినాడ:వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో104 సేవలు ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని ఏపీ(104)కాంటాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు యూనియన్ జిల్లా శాఖ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి లకు వినతిపత్రాన్ని అందించారు. ఈసందర్భంగానాయకులు వి ఆర్ ఫణి కుమార్,బి. రవిచంద్ర మాట్లాడుతూఅనేక సంవత్సరాలు గా104 లో ఉద్యోగులు సేవలు అందిస్తున్నామని గత కొంతకాలంగా ఆగిన104వాహనాలు, ముఖ్యమంత్రి జగన్ చొరవ తో తిరిగి ప్రారంభమైనాయని,గతం కంటే మెరుగ్గా104సేవలు నిర్వహిస్తామని పాదయాత్ర లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.వివిధ కేటగిరీలలో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేసి సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం వేతనాలు చెల్లించాలని,104సేవల బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved