నెల్లూరులో సిఐటియు సమావేశం

నెల్లూరులో సిఐటియు సమావేశం

user-default | Mob: | 22 Oct

నెల్లూరు : పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు జిల్లా పారిశ్రామిక వాడలలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని సి.ఐ.టి.యు నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా జి నాగేశ్వరరావు, కె అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం జ్యోతిరావు పూలే సెంటర్లోని సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి అవుతోందని, అయినా పారిశ్రామిక వాడలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. నెల్లూరు జిల్లాకు ఎక్కువ పరిశ్రమలు వస్తున్నాయని, పారిశ్రామికీకరణ వేగవంతం అవుతోందని, మరొక వైపు పరిశ్రమల స్ధాపన కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల బిడ్డలకు గానీ, ఈ జిల్లాలో చదువుతున్నటువంటి యువతకి కానీ ఉద్యోగ అవకాశాలు రావడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక వాడల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. జగన్మోహరెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆశా, అంగనవాడీ, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు, చిరుద్యోగులు మీద దాడులు జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు పాలనలో ఆశా, అంగనవాడీ, మధ్యాహ్న భోజనం, చిరుద్యోగుల మీద దాడులు జరగడం తప్పని చెప్పిన వైసిపి నేతలు నేడు స్కీమ్ వర్కర్లపై దాడులకు పాల్పడడం దుర్మార్గమని విమర్శించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో రెండు రోజుల పాటు జరిగిన సిఐటియు జిల్లా మహాసభ వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల ప్రధాన సమస్యలపై మొత్తం 6 తీర్మానాలు చేసిందని, ఈ తీర్మానాలను అమలు చేయించేందుకు పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్మికులు, ఉద్యోగులందరూ కోటి ఆశలతో జగన్మోహరెడ్డికి అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించారని, జగన్మోహరెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు బాటలో పయనించ కూడదని సూచించారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, వేదింపులను ఆపేందుకు ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్కీం వర్కర్స్, కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగులు చాలామంది పని కోల్పోయారని, ఈ విషయాన్ని మహాసభ గుర్తించి మరో తీర్మానం చేసిందని అన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని ఏ ప్రభుత్వం వస్తే అవతల ప్రభుత్వానికి సానుకూలురనే ముద్రవేసి వేధింపులకు గురిచేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఇటువంటి విధానాన్ని ఖండిస్తూ ఒక తీర్మానం, మోటారు వాహన చట్ట సవరణను వ్యతిరేకిస్తూ మరో తీర్మానం మహాసభ చేసిందన్నారు. మోటారు వాహన చట్టం సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం ఆగిందని, అది అమలు కాకుండా అడ్డుకునేందుకు సిఐటియు పోరాడుతుందన్నారు. జిడిపిలో 25 శాతం ఆదాయం తెచ్చిపెడుతున్న హమాలీ వర్కర్ల జీవితాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. హమాలీలకు జీవిత భద్రత కల్పించేందుకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని, వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసిన విధంగానే హామాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణపట్నం పోర్ట్ ఆధారంగా జిల్లాకు భారీగా పరిశ్రమలు రావడంతో నెల్లూరు జిల్లా కాలుష్య కోరల్లో చిక్కుకుందన్నారు. జిల్లాలో కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని మహాసభ ఆమోదించిందన్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి కాలుష్యాన్ని అరికట్టక పోయినట్టయితే ప్రజలు అనారోగ్యం పాలు కావడంతో పాటు వరి పంటకు ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు జిల్లాలో పంటలు పండే పరి happyతి కూడా ఉండదని అన్నారు. ఈ సమావేశంలో ఆఫీస్ బేరర్స్ దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, షేక్ రెహనా బేగం, టివివి ప్రసాద్, ఎ శ్రీనివాసులు, కె సురేష్, కొండా ప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved