శ్యామ్ ను అభినందించిన కార్పోరేటర్లు

శ్యామ్ ను అభినందించిన కార్పోరేటర్లు

user-default | Mob: | 22 Oct

శ్యామ్ ను అభినందించిన కాకినాడ కార్పొరేటర్లు కాకినాడ : పోలీస్ రంగంలో అత్యంత ప్రతిభ కనబరిచి నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యాం ఎందరికో ఆదర్శం అని కాకినాడ కార్పొరేటర్లు కొనియాడారు. ఇటీవల విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ లో రాష్ట్ర eమొదటి ర్యాంకు తో పాటు 432 మంది కానిస్టేబుల్స్ గా ఎంపిక కావడం పట్ల కార్పొరేటర్లు శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యామ్ ను మంగళవారం తన ఇనిస్టిట్యూట్లో కలిసి ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలోనే శ్యామ్ ఇనిస్ట్యూట్ పోలీసు శిక్షణ లో అగ్రశ్రేణి సంస్థ గా నిలవడం, 20 ఏళ్లుగా ఎంతోమందిని పోలీస్ ఉద్యోగులుగా తీర్చిదిద్దడం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రతిభ అని అన్నారు. ప్రతి ఏడాది వచ్చే నోటిఫికేషన్లో సగానికి పైగా ఉద్యోగాలను శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు కైవసం చేసుకోవడం చరిత్రలో రికార్డు గా నిలిచిపోతుందని అన్నారు. కాకినాడలో ఒక నిరుద్యోగిగా ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించి ఎన్నో విజయాలు సాధించడం గొప్ప విషయంగా భావిస్తున్నామని వారు చెప్పారు. భవిష్యత్తులో శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరిన్ని విజయాలను సాధించాలని మనసారా కోరుకుంటున్నా మని కార్పొరేటర్లు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కార్పొరేటర్లు కామాడి దశరథ, సంఘాని నందం, లంకె గోపి, పి.సత్యవతి తో పాటు కరప మాజీ ఎంపీపీ జి శ్రీనివాసరావు, నడకుదురు మాజీ సర్పంచ్ వై దుర్గాప్రసాద్, న్యాయవాది టీ పృద్వి రాజు తదితరులు ఉన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved