కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయం అభినందనీయం

కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయం అభినందనీయం

user-default | Mob: | 22 Oct

కాకినాడ కేంద్రీయ విద్యాలయం నిర్మాణం త్వరితగతిన చేపడతామని కేంద్ర మానవవనరుల శాఖ తెలియజేయటం ఆనందదాయకమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. కాకినాడ కేంద్రియవిద్యాలయానికి భూ కేటాయింపులో ఆదిలో నెలకున్న అనిశ్చితి నేటికీ ప్రజలకు శాపంగా మారటం బాధాకరం అన్నారు. మొదట్లో మోడీ ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ భూ కేటాయింపులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సరిగా చేయనీకరణంగా నిధులు వెనక్కివెళ్లిపోయాయని అన్నారు. తాత్కాలిగా ప్రాంగణంలో గతకొన్ని సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయం తరగతులు జరుపుతూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం తాని ఇటీవల కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్ళగా భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు పునరులెక్కించి, త్వరలో నిధులు కేటాయించి భవన నిర్మాణం చేపడతామని కేంద్ర మానవవనరుల శాఖ తెలియజేయడం ఆనందదాయకమన్నారు. విద్యార్థులకు చక్కని భవనాలు, మంచి వాతావరణంలో విద్య అందేవరకు పార్టీ తరపున తాము నిరంతరం కృషి చేస్తామని తెలియజేసారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved