భాస్కర అపార్ట్మెంట్ పై అఖిలపక్షం

భాస్కర అపార్ట్మెంట్ పై అఖిలపక్షం

user-default | Mob: | 25 Oct

భాస్కర్అపార్ట్ మెంట్ బాథితులకు అండగా సుందరయ్య భవన్ లో 26న "అఖిలపక్షం " (బిల్డర్ కాంట్రాక్టర్లను బాథ్యులు చేసి బాథితు లకు కొత్త ప్లాట్లు నిర్మించి ఇవ్వాలి .. కాకినాడ రూరల్ పర్యటనకు వస్తున్న సి.ఎం జగన్ ప్రభుత్వపరంగా జోక్యం వహించాలి : బాథితు ల పరామర్శలో సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్)23.9.2019 నివాసగ్రుహాలు క్రుంగిపోయి నడిరోడ్డుపాలైన భాస్కర్ అపార్ట్ మెంట్ బాథితులకు సత్వర న్యాయం చేయాలని అక్టోబర్2న కాకినాడ రూరల్ పర్యటనకు వస్తున్న సి.ఎం జగన్ జోక్యం వహించాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. సోమవారంఉదయం భాస్కర్ అపార్ట్ మెంట్ బాథితులను వివిధరాజకీయపార్టీల ప్రజా సంఘాల ప్రతినిథులు పరామర్శించి వారు ఎదు ర్కొంటున్న అవస్థలను తెలుసు కున్నారు. ఈసంద ర్భంగా రమణరాజు అక్కడి నిర్వాసిత అపార్టుమెంట్ వాసుల వెతల ను పాత్రికేయులకు ఒక ప్రకటన లో వివరించారు. స్వగ్రామాల్లో ఆస్తులు అమ్ము కుని 12ఏళ్ళ క్రిందట కాకినాడ భాస్కర అపార్ట్ మెంట్ లో రు.10లక్షలతో ప్లాటు కొనుక్కుని మరో రు.10 లక్షల పెట్టుబడితో సౌకర్యాలు సమకూర్చుకుని బ్యాంకు రుణాలతో చెల్లింపులు చేసుకుంటున్న పలుమద్య తర గతి కుటుంబాలు అర్థాంతరం గా రోడ్డుపాలయ్యి దిక్కు తోచని స్థితిలో వున్నారని రమణరాజు పేర్కొన్నారు. ప్లాట్ విలువ ప్రస్తుత మార్కెట్ లోరు.35 లక్షలుం టుందని సురక్షి తంగా జీవిస్తున్న వారికి పిల్లర్లు క్రుంగిపోయిన అర్థాంతర ఘట నతో వారిని ఖాళీచేయించి 3 రోజుల్లో అపార్ట్ మెంట్ 4 ఫ్లోర్లు కూల్చేస్తామని చేసిన నోటీసుల బట్వాడా యాగీతో ఎటూ పాలుపోక గుండె పోటుకు గురయ్యే రీతిలో వారి కుటుంబాలు వయోబేథం లేకుండా తీవ్రకలత చెందుతున్నారని ఇది మంచి పరిణామంకాదని రమణరాజు అన్నారు. ఆ 4ఫ్లోర్ల అపార్ట్ మెంట్ నిర్మాణంలో ఎన్నింటికి మున్సిపల్ అనుమతులు న్నాయోనన్న సందేహలున్నా యన్నారు. అథికారులు కొందరి ఒత్తిళ్ళకు లోనయ్యి తొందరపాటు చర్యలు చేయకుండా.. బాథితులు నష్టపోకుం డా ఉండేందుకు బిల్డర్ ని కాంట్రాక్టర్ ని బాథ్యులను చేసి వారికి అందించే న్యాయ పరి ష్కారాన్ని ముందస్తుగా ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షంగా అన్నిరాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు నగర అపార్టుమెంట్ సమాఖ్య లతో ప్రజాసమావేశం నిర్వహించి భాస్కర్ అపార్ట్ మెంట్ బాథితులకు న్యాయం జరిగే వరకు అండగావుంటాయని,26వతేది గురువారం ఉదయం10గంటలకు కచేరిపేట సుందరయ్యభవన్ లైబ్రరీ హలులో నగర సిపిఎం కార్యదర్శి చింతపల్లి అజయ కుమార్ అథ్యర్యాన బాథితుల కోసం "కాకినాడ అఖిలపక్షం" జరుగుతుందని తెలిపారు. మీడియా సమీక్ష జరిగిన సందర్భంగా అపార్ట్ మెంట్ బాథితులను బిజెపి జిల్లా అథ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, సిపిఐ జిల్లాకార్యదర్శి తాటిపాక మథు, సిపిఎం నగరకార్యదర్శి చింతపల్లి అజయ కుమార్, టిఎన్ టియుసి నగర అథ్య క్షుడు గదులసాయిబాబు, స్థానిక నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్, హసన్ షరీఫ్ తదితరులు ప్రత్యేకంగా పరామర్శించి వారికి అండగా నిలుస్తామని తెలిపారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved