మాజీ ఎమ్మెల్యే వనమాడికి సవాల్ విసిరిన సామాజిక వేత్త దూసర్లపూడి

మాజీ ఎమ్మెల్యే వనమాడికి సవాల్ విసిరిన సామాజిక వేత్త దూసర్లపూడి

user-default | Mob: | 25 Oct

కాకినాడ ప్రగతి గోరంత..!! .. వనమాడి ఆర్థిక ప్రగతి కొండంత..!! 3నెలల జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యేకి లేదు: అథికారంలోవున్నా ప్రతిపక్షం లో వున్నా తెలుగుదేశంపార్టీ వేదికను స్వప్రయోజనాలకు వాడుకుంటూ సెటిల్మెంట్ వ్యవహరాలతో కొండంత ఆస్తులు కూడబెట్టుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తన ఓటమి తరువాత మరల యథాప్రకారం నగర ప్రగతి అంటూ మోసలి కన్నీరు రాజకీయాలు మోదలె ట్టారని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు ఒక ప్రకటనలో విమర్శించారు. కాకినాడ అభివ్రుద్థికి తన హయాంలో(2014-2019) రాష్ట్రప్రభుత్వం నుండి ఎన్ని నిథులు తీసుకు వచ్చారో వనమాడి ప్రకటించాలని రమణరాజుడిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ కోసం ప్రతిపక్షం లో నడిరోడ్డు మీద నల్ల బట్ట లేసుకుని దీక్షలు చేయడం అథికారంలోకి వచ్చాక ఏ.సి ఫంక్షన్ హల్స్ లో మీటింగ్స్ పేరిట కార్పోరేషన్ సొమ్ములతో ఎంజాయ్ చేయడం మినహ నగరానికి డంపింగ్ యార్డు సాథించిన ప్రగతి ఏమైనా వుందా అని రమణరాజు ప్రశ్నించారు. కొండయ్యపాలెం రైల్వే వంతెన పూర్తిచేయ కుండానే రెండు సార్లుశిలాఫలకాలు వేసుకుని ఫొటోలకు ఫోజు లివ్వడం, ఉప్పు టేరు పై మూడవ వంతెనకు పేపర్ ప్రోసెస్ మినహ, అచ్యుతాపురం రైల్వేవంతెన, ఎన్.టి.ఆర్ బ్రిడ్జికి దేవాలయంవీథి వైపున ఎప్రోచ్ రోడ్ అయినా నిర్మించగలిగారా అని రమణరాజు ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కాకినాడ కార్పోరేషన్ కి 2004 నుండి రావాల్సిన ప్రభుత్వ భవనాల ఆస్థిపన్ను బకాయిలు పెనాల్టీలతో జమచేయించాల్సి న రు.48 కోట్ల రూపాయలు గురించి మీరు ఏనాడైనా సిటీ ఎమ్మెల్యే గా ఒక్కలేఖ అయినా వ్రాసి ఆనిథులు ఆయా ప్రభు త్వ శాఖల వార్షిక బడ్జెట్లలో రావడానికి ప్రయత్నంచేసారా అని రమణరాజు ప్రశ్నించారు. పరిసరగ్రామాలను కాకినాడలో విలీనం చేయడానికి మీరు ప్రభుత్వప్రతినిథిగా చేపట్టిన ఘనత ఏమైనా వుందా అని రమణరాజు వనమాడిని ప్రశ్నించారు. కేంద్రం స్మార్ట్ సిటీ నిథులు అడ్వాన్స్ గా వెయ్యికోట్లు కేటాయిస్తే వాటిని నగర ప్రయోజనాలకు వెచ్చించే సామర్థ్యంలేక రు.360కోట్ల రూపాయలతో చెట్లకు గోడలకు రంగులువేయించడం సిమ్మెం టు రోడ్లమీద సిమ్మెంటు రోడ్లు వేయించడం ఏడాదికి నాలుగు సార్లు వేసినరోడ్లమీదే తారు రోడ్లు వేయించడం, బకింగ్ హమ్ కెనాల్ పునరుద్థరణలో కొట్టుకు పోయే వార్ఫరోడ్డు ఉప్పుటేరు ప్రాంతాన మాజీ ఎమ్మేల్యే స్థలాల ముంగిట పార్కురూపేణా నిథులు వెచ్చించుకోవడం మినహ నగరానికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ గాని అదనపు మార్కెట్ గాని తీసుకువచ్చిన ఘనత ఉందా అని రమణరాజు ప్రశ్నించారు. 13వ ఆర్థికసంఘం నిథులు ఎస్.సి ఎస్.టి సబ్ ప్లాన్ నిథులు సక్రమంగా వినియోగం చేయించే సామర్థ్యం కొరవడి సగానికి పైగా నిథులు వెనక్కి మరలిపోవడం వనమాడి చేతకానితనం కాదా అని రమణరాజు ప్రశ్నించారు. విచ్చలవిడిగా పేకాటక్లబ్బులు, యథేచ్ఛగా బెల్టుషాపులు, నిషేథితగుట్కాబట్వాడా, కోస్తాతీరంలో నిషేథితసారా అమ్మకాలు, చమురు దోపిడీలు ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే వనమాడి హయాంలో పైలా పచ్ఛీసుగా కొనసాగలేదా అని రమణరాజు ప్రశ్నించారు. 2సార్లు ఎమ్మెల్యేగా పదవి చేపట్టిన వనమాడి, కాకినాడ ఊరు.. టౌన్ స్థాయినుండి సిటీగా అవతరించి దశాబ్దన్నర కాలం అయినా టౌన్ రైల్వే స్టేషన్ నేమ్ బోర్డ్ ని తన పలుకుబడితో సిటీరైల్వేస్టేషన్ గా కూడా మార్పుచేయించలేక పోయారని రమణరాజు ప్రశ్నించారు. 50డివిజన్లుగా వున్న కాకినాడ కార్పోరేషన్ వనమాడి అసమర్థ తతో 48డివిజన్లకు కుచించుకు పోయి మున్సిపాలిటీకి ఎక్కువ కార్పోరేషన్ కి తక్కువ అన్న రీతిగా దిగజార్చి చివరికి నగరపౌర సౌకర్యాల అభివ్రుద్థి కల్పనలోనూ ఎమ్మెల్యే గా వనమాడి ఘోరవైఫల్యం చెందారని.. కార్పోరేషన్ పై స్వంత ఆర్థికప్రయోజనాలకు అథికారులపై మితిమీరిన పెత్తనం చేయడం మేయర్ కార్పోరేటర్లను డమ్మీ లుగా నిలువరించడం మినహ నగర అభివ్రుద్థిసాథన విషయం లో అసమర్థతరీత్యా తీవ్ర అన్యా యం చేశారని రమణరాజు అన్నారు. గెలిచిన38మందితెదేపా కార్పోరేటర్లలో రెండేళ్ళ కాలానికే నేడు వనమాడి వెంట రెండు రెళ్ళు ఆరుచందాన మాత్రమే మిగిలారని దీనికి కారణం వారంతా వనమాడి సత్తాతో గెలిచినవారుకారని తన ముందు ఇస్ర్రీ చొక్కాలు వేసుకుని వారు దర్జాగా తిరగడాన్ని చూసి ఓర్వలేని తనంతో వున్న కారణంగానే వారుదూరమై పోయారన్నారు. నగర తెదేపా అథ్యక్షుడితో బాటుగా మూడు వంతుల డివిజన్లలో ఆ పార్టీకి అథ్యక్షులు సైతం వున్నారో లేరో చెప్పుకోలేని ద్రుతరాష్ట్ర తీరులో వనమాడి వున్నారని కేవలం తన సంపాదనవాటాల కోసమే తెలుగుదేశం కాకినాడ సిటీ అసెంబ్లీనియోజకవర్గ ఇన్ చార్జ్ పదవిని కాపాడుకుంటు న్నారని అదిలేకపోతే ఆయన సామాజిక వర్గం కూడా లెక్క చేయదని రమణరాజు పేర్కొన్నారు. నిజాయితీగా వ్యవహరించే రాజకీయాలకు వనమాడి రాలేరని చంద్రబాబుసుడితో రెండుసార్లు ఎమ్మెల్యే పదవి పొందినప్పటికీ ఆపార్టీకి గాని, పదవీ బాథ్యతలుఇచ్చిన కాకినాడ ప్రగతికిగాని చేసిందేమి లేదన్నా రు. చివరాఖరికి ఎన్ టి ఆర్ కిగాని జిఎంసిబాలయోగికి గాని సిటీ నియోజకవర్గంలో వారి కాంస్య విగ్రహాలు సైతం నెలకొల్పించ లేని ఘనుడని రమణరాజు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా వనమాడి సాథించినఘనత ఏమైనా వుంటే కరపత్రం ద్వారా బహిరంగ సమావేశాన్ని పాత్రికేయుల ఆథ్వర్యంలో ఏర్పాటు చేసి విడుదల చేయాలని ప్రతి అంశానికి తాను వివరణ ఇచ్చేదమ్ము తనకుందని రమణరాజు సవాల్ విసిరారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved