కాకినాడలో కాపు సద్భావన సంఘ సమావేశం

కాకినాడలో కాపు సద్భావన సంఘ సమావేశం

user-default | Mob: | 24 Oct

రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా వాసి రెడ్డి ని నియమించాలి... పంతం .... నవంబర్ 24న కాపు వన సమారాధన.. రాష్ట్రంలో ఉన్న అన్ని కాపు సంఘాలు ఏకగ్రీవంగా కాపు జాతి కోసం శ్రమిస్తున్న జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని మాజీ హస్తకళల చైర్మన్ పంతం నానాజీ అన్నారు. ఆదివారం ఉదయం ఎం ఎఫ్ సి ఎల్ రోడ్ లో ఉన్న కాపు కళ్యాణ మండపం లో కాపు సద్భావన సంఘం సర్వసభ్య సమావేశం జరిగినది. ఈ సమావేశానికి వాసిరెడ్డి ఏసుదాసు పంతం నానాజీ, బసవ ప్రభాకర్ రావు అధ్యక్షత వహించారు, ఈ సందర్భంగా సంఘ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంవత్సరం కాపు వన సమారాధన కు తీసుకోవలసిన బాధ్యతలు పై చర్చించారు, నవంబర్ 24 ఆదివారం వన సమారాధన ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. సంఘంలో శాశ్వత సభ్యత్వానికి వెయ్యి 116 కట్టి డాక్టర్ కొండ మూరు సత్యనారాయణ సభ్యత్వం పొందారు, అనంతరం అడ్వకేట్ పేప కాయల రామకృష్ణ మాట్లాడుతూ కాపుల్లో ఉన్న అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వారిని సంఘంలో కమిటీ సభ్యులు గా నియమిస్తే బాగుంటుంది అని భరోసా ఇచ్చారు, అలాగే కొత్త వారికి అవకాశం ఇస్తే సంఘం చురుగ్గా పని చేస్తుందన్నారు, ఈ కార్యక్రమం కాపు నాయకులు తుమ్మలపల్లి శ్రీరామమూర్తి, వినాయక కేఫ్ మాధవ రావు, ఆ డప ప్రకాష్ నాయుడు, రాంకీ రెడ్డి దుర్గారావు, బి0 ధన సురేష్ , మా గాపు లక్ష్మణరావు, నూకల నారాయణ రావు, రత్నం రాజా, కొప్పిశెట్టి శ్రీను, కోన ఉమేష్, నాయుడు, ఇంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు,,,

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved