కంటి పరీక్షలు చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి..

కంటి పరీక్షలు చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి..

user-default | Mob: | 22 Oct

సామాన్యుడీలా... కంటి పరీక్షలు చేయించుకున్న ఉపముఖ్యమంత్రి... మండపేట:- సింపుల్ సిటీ కి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చక్కని ఉదాహరణగా నిలుస్తారు.మంత్రివర్గంలో నెంబర్ టూ స్తానం లో ఉన్నప్పటికీ భేషజాలకు పోరు. నిడారంబ జీవనం..హడావిడి లేని ప్రయాణం....సామాన్యులకు సైతం అందుబాటులో ఉండి సమస్యలు సహనం గా వినే గుణం కలిగి ఉంటారు.అది మరో సారి రుజువు అయింది. మండపేట లో శనివారం ఆయన ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేరు. అక్కడ ఆసుపత్రి పరిశీలించి పై అంతస్తు కు చేరారు. ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి పరీక్షల విభాగం లో వెళ్లారు.అక్కడ ఉన్న ఆధునిక టెక్నాలజీ చూసి తాను పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ సూరంపూడి సత్యనారాయణ ఆయన కు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ ప్రతి రోజు వందల సంఖ్యలో కళ్ళు పరీక్ష చేయించు కొనేందుకు ప్రజలు విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇక్కడి సేవలు అద్భుతం గా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎక్కడ కావలిస్తే అక్కడ నేత్ర వైద్యం చేయించుకొనే అవకాశం ఉంది.అయినా ఓ సాధారణ పౌరుడి గా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరీక్షలు చేయించు కోవడం విశేషం.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved