కలెక్టరేట్లో పచ్చదనం... పరిశుభ్రత

కలెక్టరేట్లో పచ్చదనం... పరిశుభ్రత

user-default | Mob: | 27 Oct

పచ్చదనం - పరిశుభ్రత లో భాగంగా ప్రతి కార్యాలయంలో పరిసరాల పరిశుభ్రత ఉండే విధంగా అధికారులు ,సిబ్బంది పని చేయాలని కలెక్టర్ డి .మురళీధర్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ ఆవరణలో కలెక్టర్ డి .మురళీధర్రెడ్డి ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమన్నారు. పనిచేసేచోట మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం ఉందన్నారు. ప్రతి నెల మూడవ శనివారం ప్రతి ఉద్యోగి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ కార్యాలయంలోని రికార్డులను సక్రమ పద్ధతిలో ఉంచుకోవడంతో పాటు ఆవరణలో ఉన్న చెత్తాచెదారం పిచ్చిమొక్కలు తొలగించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ టు జి. రాజకుమారి లతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో స్వయంగా చెత్తా,చెదారం తొలగించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొని ఆవరణలోని పచ్చదనం - పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved