భయంతో కాకినాడ అపార్ట్మెంట్ వాసులు

భయంతో కాకినాడ అపార్ట్మెంట్ వాసులు

user-default | Mob: | 25 Oct

ప్రమాదభరితంగా బహుళ అంతస్థుల భవనం. పిల్లర్లు పగుళ్లు. ఏ క్షణమైనా కుప్ప కూలె అవకాశం. ఖాళీ చేస్తున్న ప్లాటు యజమానులు. కాకినాడ:నగర నడిబొడ్డున గల ఓ భారీ అంతస్థుల భవనంప్రమాదపుటంచున నిలబడి ప్లాటు యజమానులకు దడ పుట్టిస్తోంది. ఏ క్షణ మైనా కూలడానికి సిద్ధంగా ఉందని గుర్తించిన అధికారులు ఆ భవనం లో నివాసం ఉంటున్న40 కుటుంబాలను ఖాళీ చేయించారు. వివరాలు ఇలా ఉన్నాయి కాకినాడ సినిమా రోడ్ ను ఆనుకుని దేవీ మల్టీప్లెక్స్ ప్రక్కన భాస్కర ఎస్టేట్స్ లో60పిల్లర్ల పై20ప్లాట్స్ ఒక భవనం చొప్పున2బిల్డింగ్స్ గా13సంవత్సరాల క్రితం నిర్మించిన భవనము లో4పిల్లర్లు భారీగా పగుళ్లు ఇచ్చాయి.ఈక్రమంలో ఇదే భవనంలో కార్యాలయం నిర్వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే సోదరుడు హడావుడి గా తన కార్యాలయం ఖాళీ చేసి వేడుతుంటే ఈ విషయం బయటపడింది. దీనితో ప్లాట్ యజమానులు పోలీసు అధికారులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం భవనం ప్రమాదకరం గా ఉందని తేల్చి ఖాళీ చేయాలని కోరారు. అధికారుల సూచన మేరకు మొత్తం40 కుటుంబాల వారు రవాణా వాహనాలలో తమ సామాన్ల తో సహా తరలి వెళ్లారు.2012సెప్టెంబర్16న స్థానిక శాంతినగర్ లో శ్యామల అపార్ట్ మెంట్ భూమిలోకి కుంగిన సంగతి అందరికీ తెలిసిందే. మరోసారి అపార్ట్మెంట్ కు పగుళ్లు రావడంతో నగరంలోని భవనాల పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలానికి కమిషనర్ కే. రమేష్, డీఎస్పీ కుమార్ వచ్చి పరిశీలించారు. సాలిపేట అగ్నిమాపక అధికారి రాజా తన సిబ్బంది తో సహాయక చర్యలు చేపట్టారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved