అక్టోబర్ 2వ తేదీ జగన్ కాకినాడకు

అక్టోబర్ 2వ తేదీ జగన్ కాకినాడకు

user-default | Mob: | 22 Oct

--కరప మండలం వేళ0గి లో గ్రామ సచివాలయం ప్రారంభం --ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. కాకినాడ:రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కాకినాడ లో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారైన అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పరిపాలన లో భాగంగా రాష్ట్రమంతటా గ్రామ సచివాలయాలు వ్యవస్థ ఏర్పాటు చేసి ఆమేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది సచివాలయ ఉద్యోగుల నియామకాలు జరిపేందుకు రాత పరీక్షలు నిర్వహించి ఈ నెల19న ఫలితాలు విడుదల చేసింది. మహాత్మా గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కరప మండలం వేళ0గి గ్రామంలో గ్రామ సచివాలయం ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్, కాకినాడ నగర శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, సంబంధిత అధికారులు సమవేశం జరిపి చర్చించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved