కాకినాడలో మోడీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహం

కాకినాడలో మోడీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహం

user-default | Mob: | 27 Oct

ప్రచురణార్దం మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సప్తాహం కార్యక్రమం లో భాగంగా ఈరోజు జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ దిలీప్ కుమార్ సదనాని అధ్వర్యంలో స్థానిక వెంకట్ నగర్ లో గల ప్రగతి జూనియర్ కళాశాల లో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రముఖ సైక్రియాటిస్ట్ మరియు కార్పొరేట్ ట్రైనర్ Dr. APJ విను గారి తో సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల కు తొందరగా అర్థం అయ్యే రీతి లో ట్రైనర్ విను చక్కటి వాక్పటిమ తో వివరించారు. ఈ సందర్భంగా సదనాని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అందరం కలిసి కట్టుగా ఉంది ప్లాస్టిక్ భూతం ను తరిమి కట్టాలని కోరారు. విద్యార్ది దశ నుంచే పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు పైడా వెంకట నారాయణ, భాజాపా ఒబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు కెంగం హరి రామ ప్రసాద్, చీపూరి వాసు, చీపూరి అరుణ, శ్రీహరి, శర్మ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved