గవర్నరు ను కలిసిన చంద్రబాబు

గవర్నరు ను కలిసిన చంద్రబాబు

user-default | Mob: | 28 Oct

ఏపీలో శాంతిభద్రతల దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు  కింది స్థాయి నుంచి డీజీపీ వరకూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు గవర్నర్ కు 13 పేజీల నివేదికను అందజేసిన బాబు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతల దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 13 పేజీల నివేదికను అందజేశారు. ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, కింది స్థాయి నుంచి డీజీపీ వరకూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కోడెల ఆత్మహత్యకు ఇలాంటి పరిణామాలే కారణమని, ఎన్నికల ఫలితాల తర్వాత కోడెలపై 18 అక్రమ కేసులు పెట్టారని, సోమిరెడ్డి, అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. డీజీపీకి రెండు పుస్తకాలు అందజేసినా ఫలితం లేదని, చొరవ తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved