ఫర్నిచర్‌ వివాదం..కోడెల షోరూంలో తనిఖీలు

ఫర్నిచర్‌ వివాదం..కోడెల షోరూంలో తనిఖీలు

user-default | Mob: | 28 Oct

ఏపీ మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ కుటుంబానికి చెందిన హోండా షోరూంలో అసెంబ్లీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్ ఉందనే సమాచారం మేరకు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీజ్‌ చేసిన షోరూం తాళాలను రవాణాశాఖ అధికారులు తెరిచి తనిఖీ చేశారు. అయితే షోరూంకి వచ్చిన అసెంబ్లీ, రెవెన్యూ అధికారులకు సహకరించేందుకు షోరూం సిబ్బంది నిరాకరించారు. భవనంపైకి వెళ్లేందుకు తమ వద్ద తాళాలు లేవని సిబ్బంది చెప్పడంతో అధికారులు తాళాల కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved