అమరావతి రైతుల త్యాగాలను హేళన చేయడం తగదు

అమరావతి రైతుల త్యాగాలను హేళన చేయడం తగదు

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

రాజధాని నిర్మాణానికి సహాయం చేయాలన్నఉద్దేశంతో 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలిచ్చారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాంగ్రెస్ సిటీఅధ్యక్షుడుఆకుల వెంకట రమణ సి పి ఐ నాయకులు మధు పేర్కొన్నా రు శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా 300 రోజులుగా శాంతియుత పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాజధాని అభివృద్ధికి రైతులు చేసిన త్యాగాన్ని ఎవరూ మర్చిపోకూడదన్నారు. రైతుల్ని మంత్రులు అన్యాయంగా తిడుతున్నా 300 రోజులుగా రైతులు పారాటం చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలలు పోరాటం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇన్ని అరాచకాలు కల్లముందే జరుగుతుంటే డీజీపీ ఎందుకు స్పందించడం లేదని, ఇక పోలీసు వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులు చేసిన వారిలో ఒక్కరినైనా పట్టుకున్నారా అని అడిగారు. నియోజకవర్గాల్లో రైతులకు సంఘీభావంగా నిరసన తెలుపుతామని,. మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. రైతులుకు అన్యాయం జరుగుతుంటే మౌనం వహించడం సరికాదని, దేశంలో రైతుకు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని స్సష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై టిడిపి పార్టీ పోరాటాలు చేస్తుందని తెలిపారు ఆదివారం ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు అఖిలపక్షం చేపడుతున్నట్లు తెలిపారు అదేవిధంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు ఈ సమావేశంలో గుబ్బల సాయి శ్రీనివాస రావు పిట్ట వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved