రాహుల్ ప్రియాంక గాంధీ లను అరెస్టు చేయడం దారుణం..ఆకుల

రాహుల్ ప్రియాంక గాంధీ లను అరెస్టు చేయడం దారుణం..ఆకుల

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

ఉత్తర్‌ప్రదేశ్‌ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ సిటీ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ అన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ , లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిలను పురస్కరించుకుని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా కేంద్రంలోని కాకినాడ కల్పన సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ ప్రియాంక గాంధీ ని అరెస్ట్ చేయడం దారుణమన్నారు తక్షణమే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు క్షమాపణ చెప్పాలి. నైతిక భాజ్యత వహిస్తూ యూ పి సి ఏం యోగి రాజీనామా చెయ్యాలని ఆకుల డిమాండ్ చేసారు. మోదీ ప్రభుత్వానికి కాలం చెల్లి రోజులు దగ్గర పడ్డాయన్నారు కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లువలన రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు కేంద్ర రాష్ట్ర అనుసరిస్తున్న విధానాల వలన ప్రజలు తీవ్ర నష్టపోతున్నారన్నారు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు సిద్ధమవుతుందనిఆరన తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దాడ సుబ్బారాయుడు, సబ్బితి ఫణేశ్వరరావు, కోలా ప్రసాదవర్మ, నగర ఉపాధ్యక్షులు బాజిబోయిన వెంకటేష్ నాయుడు, కడియాల శ్రీనివాస్ సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కంభం రాజబాబు తాళ్లూరి రాజు, పబ్బినీడి కృష్ణ, తిమ్మాపురం సత్తిబాబు,చెక్కా నూకరాజు, ఎల్ .సత్తిబాబు, తుమ్మలపల్లి వాసు, పద్మావతి, అనూష,కుక్కల పోతురాజు, నారయ్య, జుత్తుక సత్తిబాబు, వల్లూరి రామ మోహన్, ఎస్ కె సర్దార్,మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved