28వతేదీలోగానామినేషన్లనుపంపించాలి

28వతేదీలోగానామినేషన్లనుపంపించాలి

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

ఇన్ స్పైర్ మనక 2020 - 21 నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 28 వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ . అబ్రహాం తెలిపారు . శుక్రవారం డిఇఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్ధులు , ప్రాథమిక ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు నామినేషన్లు ఆన్లైన్ లో నమోదు చేయాలని తెలిపారు . ఇన్ స్పైర్ వెబ్ సైట్ http://www.inspireawards-dst.gov.in/ నందు నమోదు చేయాలని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎంపికైన విద్యార్ధి బ్యాంక్ అకౌంట్లో నేరుగా రూ . 10,000 / క్రెడిట్ కాబడతాయని తెలియచేశారు . దీనికి నామినేషన్స్ పంపుటకు చివరి తేది 28 సెప్టెంబరు , 2020 . కావున జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు , సైన్స్ ఉపాధ్యాయులు తప్పని సరిగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు . ఈ ప్లాట్ ఫాం ద్వారా భావి శాస్త్రవేత్తలను గుర్తించి వారిని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళి వారికి నేరుగా పేటెంట్స్ ఇప్పించగలిగే అద్భుత అవకాశం ఇన్ స్పైర్ కల్పిస్తుందని , కనుక దీనిని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైన ఉందని అన్నారు . ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ప్రధానోపాధ్యాయులుకు సూచించారు . ఇతర వివరాలకు సైన్స్ ఉపాధ్యాయులు కేసరి శ్రీనివాసరావు , సెల్ : 9912703697 ను సంప్రదించవలసినదిగా జిల్లా విద్యాశాఖాధికారి కోరారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved