హిందూ దేవాలయాలపై దాడులు అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం విఫలం

హిందూ దేవాలయాలపై దాడులు అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం విఫలం

user-default | Mob: | 22 Oct

రాష్ట్రంలో హిందూ దేవాలయాలు ధార్మిక సంస్థల పై జరుగుతున్న దాడులను అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం చెందిందని తెలుగు మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి తుమ్మల రమేష్ ఆరోపించారు.హిందూ దేవాలయాలు ధార్మిక సంస్థల పై జరుగుతున్న దాడులకు నిరసనగా కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జగన్నాధపురం చంద్రిక థియేటర్ వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయము నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా తుమ్మల రమేష్ చిక్కాల సత్యవతి మాట్లాడుతూ దేశంలో ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ ప్రాంతం వారైనా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని, ఆ హక్కులను హరించే పరిస్థితి ఆంధ్రప్రదేశంలో నెలకొందని, రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వరుస ఘటనలు దారి తీస్తున్నాయని, ఇకనైనా సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించి ఇకపై ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా హిందూ దేవాలయాలు ధార్మిక సంస్థలను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబటి చిన్నా, బంగారు సత్యనారాయణ, రవణమ్మ, నాగరాజు, సామంతుల నాగేంద్ర కుమార్, పోలినాటి సత్య, నాగ కుమారి, పొంగా బుజ్జి, గొరుసు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved