గొప్ప రాజనీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ

గొప్ప రాజనీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

దేశంలో గొప్ప రాజనీతిజ్ఞుడు భారతరత్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అని కాకినాడ నగర అధ్యక్షులు ఆకుల వెంకట రమణ అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికి ఆయన మృతి తీరని లోటన్నారు. రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ నిబంధనలను అవపోశనపట్టిన రాజకీయ దురంధరుడని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అంచలంచలుగా ఎదిగి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన వైయస్ రాజశేఖర్రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయం నిలుస్తారన్నారు ఈ కార్యక్రమం లో సబ్బతి గౌ. ఫణేశ్వరరావు, పెద్దాడ సుబ్బారాయుడు, కాకినాడ నగర ఉపాధ్యక్షులు బాజిబోయిన వెంకటేష్ నాయుడు, కడియాల శ్రీనివాస్ సిటీ వైస్ ప్రెసిడెంట్, పిట్టా అర్జున్, తాళ్లూరి రాజు, జనిపల్లి రాము, ఎస్ కె సర్దార్, జుత్తుక సత్తిబాబు, వల్లూరి రామ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved