బధిర బాలునకు ఆర్ధిక చేయూత

బధిర బాలునకు ఆర్ధిక చేయూత

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

కాకినాడ దేవాలయం వీధులో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం కాకినాడ కు చెందిన కె.జోయల్ రాజు నాలుగేళ్ళ బాలునికి 50 వేల రూపాయలు విలువచేసే రెండు చెవిటి యంత్రాలను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టుకతోనే జోయల్ రాజు కు వినికిడి లోపం ఉందన్నారు వైద్యులు పరీక్షించి చెవిటి యంత్రాన్ని సూచించడం జరిగిందన్నారు ట్రస్టు ద్వారా 50 వేల విలువచేసే చెవిటి యంత్రాలను ఇవ్వడం జరిగిందన్నారు ఆర్థికంగా స్థిరపడిన వారందరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ కె.రామకృష్ణ వి వి రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved