డాక్టర్ గంగాధర్ పై కేసు నమోదు చేయడం భావప్రకటన హక్కుల​ను హరించడమే

డాక్టర్ గంగాధర్ పై కేసు నమోదు చేయడం భావప్రకటన హక్కుల​ను హరించడమే

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగాధర్ పైసి.ఐ.డి కేసు నమోదు చేయడం భావప్రకటన హక్కుల​ను హరించడమే అని కాంగ్రెస్ నగర అధ్యక్షులు ఆకుల వెంకటరమణ నేమాం పెద్ద బాబు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్ ప్రభుత్వం డా. గంగాధర్ పై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకరోనా పై ప్రముఖ వైద్యుడు చేసిన నిర్మాణాత్మక విమర్శలను గుర్తించలేని పరిస్థితులలో వై.సి.పి ప్రభుత్వం ఉందన్నారుకోవిడ్ వ్యాపిస్తున్న విషయంలో అప్పటి పరిస్థితులను ప్రజారోగ్యాన్ని​ దృష్టిలో పెట్టుకుని పి.పి.ఈ కిట్లు, వెంటిలేటర్ సదుపాయాల గురించి ప్రభుత్వం కరోనా పట్ల అశాస్త్రీయమైన​నిర్లక్ష్యం ధోరణిని క్లుప్తంగా డాక్టర్ గంగాధర్ విశ్లేషించడం జరిగిందన్నారు ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా ప్రశ్నించినందుకు ప్రతిఫలంగా డాక్టర్ గంగాధర్ పై నాలుగు నెలల అనంతరం సి.ఐ.డి విచారణకు రావాలని పిలవడం, ప్రాథమిక విచారణ చేపట్టకుండానే సి.ఆర్.పి.సి. సెక్షన్ 41ఏ (1) క్రింద నోటీసులు జారీ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తుమన్నారు ఈ కార్యక్రమంలో. సబ్బతి ఫణేశ్వరరావు కడియాల శ్రీనివాస్ ,పోతురాజు, రాజుబాబు బ్రహ్మం, వల్లూరి రామమోహన్, మూర్తి తదితరు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved