ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మ భారత దేశ మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 76వ జయంతి వేడుకలుగురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కాకినాడ నగర అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ, నేమాం పెద్ద బాబు ఆధ్వర్యంలోఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పేదలకు పండ్లు పంచి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి, పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామస్వరాజ్యం కోసం సర్పంచులకు సర్వాధికారాలు ఇస్తూ రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ కే దక్కుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్బతి ఫణేశ్వరరావు కడియాల శ్రీనివాస్, తుమ్మలపల్లి వాసు, ఎస్ కె సర్దార్, బ్రహ్మం, వల్లూరి రామమోహన్, మూర్తి తదితరు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved