ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్లను క్లీనర్ లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్లను క్లీనర్ లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

కోవిడ్ - 19 కారణంగా గత నాలుగు నెలల నుండి ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్లు, కండక్టర్, క్లీనర్ల పరిస్ఠితి ఆందోళనాకరంగా మారిందని శ్రీ రథసారధి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ అండ్ క్లీనర్స్ సంక్షేమ సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు శ్రీనివాస్, ఎం. మాధు మోహన్ బాబు, డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆటోనగర్ నుండి కలెక్టర్ కార్యాలయానికి బైక్ ర్యాలీ నిర్వహించి ఇంద్రపాలెం వద్ద అంబేత్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా గత నాలుగు నెలలనుండి ప్రజా రవాణా లేని కారణంగా, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిలిపివేయడం జరిగిందనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని అందులో భాగంగానే ఆటో కార్మికులకు రూ 10,000 ఆర్థిక సహకారం అందించడం జరిగిందని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లను, కండక్టర్లను మరియు క్లీనర్ లను ప్రభుత్వం గుర్తించి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. సెక్రెటరీ శివ, ట్రజరర్ రమేష్, జెసి ప్రసాద్, పలువురు డ్రైవర్లు, కాంట్రాక్టర్లు, క్లీనర్లు తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved