కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ నిరసనలు

కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ నిరసనలు

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోమ్ శాఖా మంత్రి అమిత్ షా మైండ్ గేమ్ ఆడుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజస్థాన్ వివాదంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ ,నేమాం పెద్ద బాబు మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీతో బలపరీక్ష కు గవర్నర్ వద్దకు వెడితే, ప్రతిపక్ష బీజేపీ గవర్నర్ ను తప్పుదోవ పట్టిస్తోందన్నారు.గతంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య హుందాతనంతో కూడిన రాజకీయాలు ఉండేవని గుర్తు చేశారు.బీజేపీ నీచ రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. మొన్న మధ్యప్రదేశ్, నిన్న కర్ణాటక, నేడు రాజస్థాన్ రాష్ట్రాలలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసిందని, బీజేపీ తీరును తీవ్రంగా ఖండించారు. బీజేపీ పార్టీ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నేమాం పెదబాబు, తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో నాయకులు కడియాల శ్రీనివాస్, బాజిబోయిన వెంకటేశ్వర నాయుడు, సబ్బతి ఫనీశ్వరరావు, జుత్తుగ సత్తిబాబు, కుక్కల పోతురాజు, తుమ్మలపల్లి వాసు, జనుపల్లి రాము, వల్లూరి రామ్మోహన్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved