ఘనంగా . స్వాతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్,చంద్రశేఖర్ ఆజాద్ ల జయంతి వేడుకలు

ఘనంగా . స్వాతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్,చంద్రశేఖర్ ఆజాద్ ల జయంతి వేడుకలు

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

కాకినాడ నగరంలోని బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు లోకమాన్య బలగంగాధర్ తిలక్,చంద్రశేఖర్ ఆజాద్ ల జయంతి కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణ గోపాల్ లునాని మాట్లాడుతూ జాతీయోద్యమంలో తిలక్ స్వదేశీ,స్వరాజ్య,విదేశీ వస్తువుల బహిష్కణ, జాతీయ విద్య అనే అస్త్రాలతో బ్రిటీషు వారిపై పోరాటంలో ప్రజలందరినీ గణేశ ఉత్సవాలు,శివాజీ జయంతి ఉత్సవాలద్వారా సమైక్య పరచి,దేశభక్తిని జాగృతం చేసిన గొప్ప యోధుడని నివాళులు అర్పించారు.జాతీయోద్యమంలో పోరాడటానికి ఎందరో యువకులకు స్ఫూర్తిని కలిగించిన గొప్పనాయకుడు చంద్రశేఖర్ ఆజాజ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ బి.వి.కె రాజ్,జి జి కళ్యాణ్ కుమార్,పోనుగుపాటి సుబ్బారావు,చోడిశెట్టి రమేష్ బాబు,టి నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved