ప్రైవేట్ హాస్పిటల్స్ లను చిన్న పరిశ్రమగా గుర్తించాలి

ప్రైవేట్ హాస్పిటల్స్ లను చిన్న పరిశ్రమగా గుర్తించాలి

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు , ఉద్యోగులకు వసతి , భోజన సౌకర్యం కల్పిస్తూ , ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేటు హాస్టలు చిన్న తరహా పరిశ్రమలుగా గుర్తించి ప్రభుత్వం తరపున రాయితీలు , ప్రోత్సాహకాలు ప్రకటించాలని ది . సోసైటి ఆఫ్ కాకినాడ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అధ్యక్షురాలుసౌభాగ్య కోరారు . కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ది . సోసైటి ఆఫ్ కాకినాడ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ హాస్టల్స్ సమస్యల పై ధర్నా నిర్వహించారు . తొలుత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫ్లెక్సికి ది.సోసైటి ఆఫ్ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అద్యక్షురాలు సౌబాగ్య , సెక్రటరీ శివాజీ లు పూలమాలలువేసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ది సోసైటి ఆఫ్ కాకినాడ ప్రైవేట్ హాస్టల్ ఓనర్స్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని ప్రైవేటు హాస్టలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని , విద్యుత్ చార్జిలు తగ్గించాలని , ప్రైవేటు హాస్టల్స్ యాజమాన్యాన్ని ఆదుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసారు . ఈ సందర్భంగా ది సోసైటి ఆఫ్ కాకినాడ ప్రైవేటు హాస్టల్స్ ఓనర్స్ అద్యక్షురాలు సౌబాగ్య మాట్లాడుతూ పికలలోతు నష్టాలలో కూరుకుపోయిన ప్రైవేటు హాస్టల్స్ యాజమాన్యాలను ఆదుకోవాలని కోరారు . సంస్థ సభ్యుడు స్టాలిన్ మాట్లాడుతూరాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులు , ఉద్యోగులకు వసతి బోజన సదుపాయాలు కల్పిస్తున్న ప్రైవేటు హాస్టల్ ను చిన్న తరహా పరిశ్రమలుగా గుర్తించి వాటికి రాయితీలు ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరారు . ఈ కార్యక్రమంలో సోసైటి ఉపాధ్యక్షురాలు సత్య కళావతి , జాయింట్ సెక్రటరీ పరమేశ్వర్ , ట్రెజరర్ కాంతమణి . నాయకులు కళ్యాణ్ , నాగేశ్వరరావు , శేఖర్ , మేఘన , కృష్ణ , సత్యం , పి.దేవి , పి.మంగతాయారు , శ్రీదేవి , నాగు , బి.దేవి , వీరబాబు , కేదార్నాధ్ సత్యప్రసాదు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved