కరోనా వ్యాధిగ్రస్థులకు ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యసేవలు అందించాలి

కరోనా వ్యాధిగ్రస్థులకు ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యసేవలు అందించాలి

user-default suresh gona | Mob: 7799146666 | 19 Oct

కరోనా వ్యాధిగ్రస్థులకు ప్రైవేటు ఆసుపత్రులలో కూడా వైద్యసేవలు అందించేలనిబీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనావ్యాధిగ్రస్థులు ఎక్కువుగా పెరుగుతున్న సందర్భంలో రాజమహేంద్రవరం, విశాఖపట్నం లలో మాదిరిగా కాకినాడలో కూడా ప్రైవేటు ఆసుపత్రులలో సదుపాయాలు సమకూర్చి తక్కువ ఖర్చుతో కాకినాడ పార్లమెంట్ పరిధి లోని కరోనావ్యాధి గ్రస్తులకు చికిత్స చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు అలాగే కరోనా పరీక్షలలో జరుగుతున్న జాప్యం కారణంగా కరోనా వచ్చిన వారి కారణంగా వ్యాధి ఎక్కువుగా వ్యాప్తిచెందుతుందని. త్వరితగతిన కరోనా పరీక్షలు జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 108 అంబులన్సులు సమయానికి అందుబాటులో లేనికారణంగా కరీనా వ్యాధిసోకిన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని, దాని కారణంగా చికిత్స వెంటనే అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved