ఆత్మ నిర్భర భారత్ పై ప్రజలలో అవగాహన

ఆత్మ నిర్భర భారత్ పై ప్రజలలో అవగాహన

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

కరోనా కష్టం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రధాని మోడీ ఆత్మ నిర్భార్ భారత్ పథకం ప్రకటించడం జరిగిందని ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని జిల్లా బిజెపి అధ్యక్షుడు చెరుకూరు రామ్ కుమార్ , బీజేపీ సీనియర్ నాయకులు మాలకొండయ్య తెలిపారు శనివారం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఖరీఫ్ కల్యాణ పథకం1.70 లో మొదటి దశలో లక్ష కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు ఈ పథకం కింద కోట్ల మందికి ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఉజ్వల పధకం లో 8.19 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకం కింద లక్ష కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు 20 24 -25 సంవత్సరానికి భారతదేశం ఆర్థిక వ్యవస్థ 5ట్రిలియన్ డాలర్లకు లక్ష సాధించేందుకు వేగవంతమైన పెట్టుబడులు విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved