అక్రమంగా వేతనాలు పొందుతున్న ఉద్యోగులపై చర్యలు చేపట్టాలి : దళిత జేఏసీ డిమాండ్

అక్రమంగా వేతనాలు పొందుతున్న ఉద్యోగులపై చర్యలు చేపట్టాలి : దళిత జేఏసీ డిమాండ్

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

జిల్లా ఎస్సి కార్పొరేషన్ లో ఎటువంటి నియామక ఉత్తర్వులు లేకుండా గతకొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పొందుతున్న ఉద్యోగులపై అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని దళిత జేఏసీ డిమాండ్ చేసింది. ఈమేరకు గురువారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈసందర్భంగా ఎస్సి ఎస్టీ మోనటరింగ్ కమిటీ సభ్యులు నక్కా చిట్టిబాబు, సిద్ధాంతుల కొండబాబు మాట్లాడుతూ ఎస్సి కార్పొరేషన్ లో అధికారిక ఉత్తర్వులు లేకుండా నలుగురు ఉద్యోగులు డి.శ్రీనివాస్ టైపిస్టుగా పనిచేసిన జి.ఎస్.కె.ఎస్. సతీష్ స్టెనో,వి.ప్రకాష్ టైపిస్టు గా,పి.వి.వి.లక్ష్మి సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారని, వీరందరూ గతంలో కంటింజంట్ ఉద్యోగులుగా కలెక్టర్, ఈడీ ఆమోదం లేకుండా చేరారని,2018 లో నిబంధనలకు విరుద్ధంగా టైమ్ స్కెల్ పొందారని తెలిపారు. ఇప్పుడు రెగ్యులర్ స్కెల్ తీసుకుంటున్నారని అన్నారు.వాస్తవానికి జీవో212 ప్రకారం చేరిన నాటినుండి 5సంవత్సరాల సర్వీస్ పూర్తవ్వాలని, వీరు అడ్డదారిలో ఉన్నతాధికారులను మోసగించి పదోన్నతులు పొందారన్నారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ నలుగురు కొనసాగుతున్నారని తెలిపారు. వివిధ పనులపై ఈ కార్యాలయానికి వెడితే వీరు చులకన చేసి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సి కార్పొరేషన్ లో జరిగిన ఈ అనధికార నియామకాలపై శాఖాపరమైన దర్యాప్తు చేసి, నలుగురు ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత నాయకులు తాళ్లూరి రాజు, కాకిలేటి రవీంద్ర, పిల్లి శివకుమార్, బచ్చల కామేశ్వరరావు, పిట్టా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved