శ్యాంప్రసాద్‌ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం..బిజెపి జిల్లా అధ్యక్షుడు

శ్యాంప్రసాద్‌ ముఖర్జీ సేవలు చిరస్మరణీయం..బిజెపి జిల్లా అధ్యక్షుడు

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

నివాళ జాతీయ సమగ్రత, అఖండ భారతావని కోసం నిరంతరం పరితపించి ప్రాణత్యాగం చేసిన గొప్ప నేత శ్యాంప్రసాద్‌ ముఖర్జీ అని, ఆయన సేవలు చిరస్మణీయమని భాజపా జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ,బిజెపి నాయకులు బీ.వి.కృష్ణం రాజు అన్నారు.ముఖర్జీ జయంతి సందర్భంగా కాకినాడ లోబిజెపి కార్యాలయంలో ఆయన శ్యాంప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, దేశ సమగ్రత నినాదంతో ఆర్టికల్‌ 370కి వ్యతిరేకంగా బలమైన గళం వినిపించారన్నారు. జమ్మూకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలని ఆనాడే ఉద్యమించారన్నారు. నెహ్రూ అవలంబించిన మైనారిటీ అనుకూల విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలను వ్యతిరేకించి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా జనసంఘ్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ముఖర్జీ స్ఫూర్తిగా ప్రధాని మోదీ అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన కొనియాడారు.జిల్లా లో అన్ని బూత్ లలో కార్యకర్తలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తవ్వల నగేష్ కుమార్ , మొసలిగంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.... .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved