అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడం దారుణం

అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడం దారుణం

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

మాజీ మంత్రి వర్యులు , శాసన సభ్యులు అచ్చెన్నాయుడు అక్రమంగా అరెస్టు చేసి అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడంపై కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దుమ్ములపేట సెంటర్ నందు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గదులు సాయిబాబా, తుమ్మల రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రి నందు సరైన వైద్యం అందించకుండా ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయడం యాంటి టైమ్ వేసి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయడం హేయమని సాయంత్రం 5గం తర్వాత 4.20గం సమయం వేసి డిశ్చార్ చేయడం దుర్మార్గమని డిశ్చార్జ్ చేయడంలో కనీస నిబంధనలు పాటించక పోవడం కమిటి పేరుతో ఒత్తిళ్లు తెచ్చి తప్పుడు నివేదిక ఇప్పించి కమిటి ముసుగులో, తప్పుడు నివేదికలతో, ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతునారని ఇప్పటికే అచ్చెన్నాయుడి అరెస్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసి రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైందిని ఆయన ఆరోగ్యం మెరుగుపడికముందే డిశ్చార్జ్ చేసి జైలుకు పంపారని, ప్రతిపక్షాన్ని అనిచి వేయాలని ధోరణితో ప్రతిపక్ష నాయకుల పై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎరిపిలి రాము, మూగు రాజు, చోడి పిల్లి సతీష్, చూడు పిల్లి సతీష్ గాది శివరామకృష్ణ, గదులు వీరబాబు, పేకేటి భాస్కరరావు, సింహాద్రి, ఎండి గౌస్ , మాదే ఆందిరియ , సింహాచలం, బాదం కుమార్, ఎరిపిలి అబ్బాయి, మారుపిలి అబ్బాయ, కడలి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved