డీఎస్సీ ద్వారా గ్రామసచివాలయ ఉద్యోగాల భర్తీ

డీఎస్సీ ద్వారా గ్రామసచివాలయ ఉద్యోగాల భర్తీ

user-default | Mob: | 22 Oct

ఏపీలోని గ్రామ సచివాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని.. ఈ ఉద్యోగాల భర్తీకి జులై 15 నాటికి నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆయన ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి 2వేల మందికి గ్రామ సచివాలయం ఉండాలని.. అందులో ఉద్యోగాలను జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జగన్‌ ఆదేశించారు. వివిధ అర్హతలున్నవారిని పరిగణనలోకి తీసుకోవాలని.. వారు తమకు కేటాయించిన ఏపనినైనా చేయగలిగేలా తీర్చిదిద్దాలని సీఎం దిశానిర్దేశం చేశారు. మరోవైపు మంచినీటి ఎద్దడి లేకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని జగన్‌ సూచించారు. దీనికోసం డ్రింకింగ్‌ వాటర్‌ కార్పొరేషన్‌ను నోడల్‌ ఏజెన్సీగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని తాగు, సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాబోయే 30 ఏళ్లలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచించాలని అధికారులకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved