పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలి

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలి

user-default suresh gona | Mob: 7799146666 | 31 Oct

గత పదిహేను రోజుల నుంచి రికార్డ్‌ స్థాయిలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారంకల్పన సెంటర్ పెట్రోల్ బంక్ వద్ద జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ విషయమై డిఆర్ఓ కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు నురుకుర్తి వెంకటేశ్వరరావు ఆకుల వెంకట రమణ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ బ్యారల్‌ ధరలు మూడొంతులు తగ్గినప్పటి కీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇకనైనా పెంచిన ధరలను తగ్గించాలని, లేకుంటే జాతీయస్థాయిలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు సుబ్బారాయుడు ,వాసు ,కడియల శ్రీ నివాస్ మోహన్ రావు ,సర్దార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved