కరోనా సోకిన గర్భిణీ కి సిజేరియన్ చేసిన వైద్యులు మగ బిడ్డ జననం

కరోనా సోకిన గర్భిణీ కి సిజేరియన్ చేసిన వైద్యులు మగ బిడ్డ జననం

user-default suresh gona | Mob: 7799146666 | 31 Oct

: తూర్పుగోదావరి జిల్లాలో కరోన సోకిన గర్భిణికి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైద్యులు సిజేరియన్ చేసి తల్లిబిడ్డలను కాపాడారు. హోం క్వారంటైన్ లో ఉన్న కరోనా సోకిన గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం రాత్రి హుటాహుటిన అంబులెన్స్ లో జిజిహెచ్ కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శనివారం వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సిజేరియన్ చేసిన డాక్టర్ ఉషారాణి, డాక్టర్ లావణ్య, డాక్టర్ మౌనిక, మత్తు డాక్టర్ ప్రవీణ, వైద్య సిబ్బంది భారతి, రాణిలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, జిజిహెచ్ సూపరింటెండెంట్ ఎం రాఘవేంద్రరావు అభినందించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved