కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలి

కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలి

user-default suresh gona | Mob: 7799146666 | 24 Oct

ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు నిర్లక్ష్యం విడనాడాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్విన్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు శనివారం కాకినాడ కార్పొరేషన్ లో ప్రతి శనివారం పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించారు కార్పొరేషన్లో ప్రతి విభాగాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు . ఈ సందర్భంగా ఆయన కార్యాలయం గేటు ముందు పడి ఉన్నా వ్యర్థాల కవర్లను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో కార్యాలయాన్ని ఉంచాలన్నారు. మరోక సారి ఇలాంటి పరిస్థితులు ఉంటే సహించేదిలేదన్నారు వాహనాలు ఆఫీసు ప్రాంగణంలోనికి తీసుకురాకుండా ప్రభుత్వ అధికారులకు, సందర్శకులకు వేరు వేరు పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిరోజూ వినియోగించుకున్న అనంతరం వచ్చే వ్యర్థ పదార్థాలను చెత్త బుట్టల్లో మాత్రమే వేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి శనివారం ఉద్యోగుల సహకారంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రాంగణాన్ని శుభ్రం చేసుకోవాలన్నారు. ఆయన వెంట కార్పొరేషన్ అధికారులు సత్యనారాయణ రాజు సత్య కుమారి మురళి తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved