పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ

పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ

user-default suresh gona | Mob: 7799146666 | 14 Jul

కరోనా వైరస్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన పేదవారికి రెడ్ కాన్వెంట్(1978) పూర్వ విద్యార్థులు నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని పూర్వపు లయన్స్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు బుధవారం కాకినాడ లక్ష్మీ నగర్ లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు నెలలకు సరిపడా 23 పేద కుటుంబాలకు లక్ష రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా మూడు నెలల నుంచి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు రిక్షా కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగిందన్నారు ట్రస్ట్ ఫౌండర్ బచ్చు కమలబాబు తల్లి లక్ష్మి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శీమకుర్తి పాపారావు, వి వి రామ్ చరణ్ స్వాతి తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved