రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఆర్ధిక భరోస

రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఆర్ధిక భరోస

user-default suresh gona | Mob: 7799146666 | 20 Oct

రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఆర్ధిక భరోస కల్పించాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు . బుధవారం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యలయం నుండి ప్రారంబించారు . ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కార్యలయం వివేకానంద హాల్ నుండి విడియో కాన్ఫోరెన్స్ ద్వారా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ , సాంఘిక శాఖ మంత్రి పినిపి విశ్వరూప్ , కాకినాడ , రాజమహేంద్రవరం , అమలాపురం పార్లమెంట్ సభ్యులు వంగా గీత , మార్గని భరత్ చింతా అనురాధ , జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి , కాకినాడ సిటి , రామచంద్రాపురం , పిఠాపురం , ముమ్మిడివరం , రాజోలు , పి.గన్నవరం శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి , సిహెచ్.వేణుగోపాలకృష్ణ , పెండం దొరబాబు , పొన్నడ వెంకట సతీష్ , రాపాక వరప్రసాద్ , కొండేటి చిట్టిబాబు , జాయింట్ కలెక్టర్ ( డబ్ల్యు ) జి.రాజకుమారి పాల్గొన్నారు . ఈ సందర్భంగా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంవత్సర కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పర్చటం అయినందనీయం అన్నారు .45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు కాపు మహిళలకు లబ్ధి చేకూర్చుడం పట్ల కాపు మహిళలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు . రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఆర్ధిక భరోస కల్పించాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అదే విధంగా వచ్చే నెలలో ఎస్సీ , ఎస్టీ , బిసి , మైనారీటి మహిళలకు ఇటువంటి పథకాన్ని అమలకు కేబినేట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు . కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత మాట్లాడుతూ కాపు మహిళల కోసం కాపు నేస్తం పథకం అమలు పరచడం కాపుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న మంచి మనస్సుకు నిదర్శనమని ముఖ్యమంత్రిని అభినందించారు . జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ కాపు , తెలగ , ఒంటరి మరియు బలిజ కులంలకు చెందిన రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధికంగా 76,284 మంది లబ్ధిదారులకు సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రికి విడియో కాన్ఫోరెన్స్ ద్వారా వివరించారు . ఈ సందర్భంగా రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్ర బోస్ ను మంత్రి విశ్వరూప్ . పార్లమెంట్ సభ్యులు , శాసనసభ్యులు , జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు . అనంతరం వైఎస్ఆర్ కాపు నేస్తం లబ్దిదారులకు చెక్కును అందజేసారు . ఈ కార్యక్రమంలో బిసి కార్పోరేషన్ ఈడి , ఎస్విఎస్ సుబ్బలక్ష్మి కాపు నేస్తం లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved