ప్రజలకు మెరుగైన సేవలు..ఎంపీ

ప్రజలకు మెరుగైన సేవలు..ఎంపీ

user-default suresh gona | Mob: 7799146666 | 27 Oct

మున్సిపల్ ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు . బుధవారం ఆనందభారతి లో గల మున్సిపల్ సుపీరియర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మీటింగ్ రిక్రియేషన్ హాలు ఆధునీకరణ పనులను ప్రారంభించారు అసోసియేషన్ ఇంచార్జ్ ప్రెసిడెంట్ పి ఆర్ వి ఎస్ ఎస్ రాజేష్ , కార్యదర్శి సిహెచ్ జాన్ పాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ ఉద్యోగులు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు తీసుకుంటూ ఉన్నామంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయ అని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరడం జరిగిందని సిపిఎస్ రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేయడం జరుగుతుందన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ ఉద్యమిస్తున్న కుటుంబ సభ్యులను సైతం వదిలి ప్రజల కు మున్సిపల్ ఉద్యోగులు సేవలు అందించడం జరుగుతుందన్నారు లాక్ డౌన్ నిబంధనలు పట్టించుకోకపోవడం వల్లే కరోనా మహమ్మారి విజృంభిస్తుందన్నారుఈ అసోసియేషన్ భవనానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి అసోసియన్ భవనంగా నామకరణం చేయాలన్నారు మున్సిపల్‌లో జవాబుదారీ తనంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. భవన నిర్మాణ అనుమతులు, నీటి కనెక్షన్‌లను సైతం ఆన్‌లైన్‌లో అనుమతులు పొందే సౌకర్యం ఉంటుందని తెలిపారు. గ్రామ సచివాలయాలు, మొబైల్ యాప్ వంటి సదుపాయాలతో ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలను అందిస్తామని పేర్కొన్నారు. శానిటేషన్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకుండా ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రత్యేకమైన విధానంతో శానిటేషన్‌ను తీసుకువస్తామని తెలిపారు. కాకినాడ కమిషనర్ దినకర్ పుండ్కర్ , మేయర్ సుంకర పావని మాట్లాడుతూ నగరంలో హరితహారంలో మొక్కలు నాటడం, రోడ్లపై కాలుష్య నివారణకు డివైడర్ మధ్యలో, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్ నాగేశ్వరరావు కార్పొరేటర్ సత్యనారాయణ కార్పొరేషన్ అధికారులు కర్రీ సత్యనారాయణ రావు,డాఆకుమర్తి శామ్యూల్ సత్య కుమారి రామ్మోహన్ రావు సత్తప్ప నాయుడు, సురేష్ కుమార్ కామేశ్వరి రూప సుబ్బారావు ప్రసాద్ ధర్మాజి‌ , రమణ మహాలక్ష్మి ,ఎంవి రమణ , చంద్రమౌళి జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved