ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

user-default | Mob: | 20 Oct

కాకినాడ కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడు, యువవనేత రాహుల్ గాంధీ 50 వ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కేకు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ జరిగింది. పీసీసీ కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావు ,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల వెంకట రమణసారధ్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు ఈ సందర్భంగా జనావళి వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా నులుకుర్తి, ఆకుల వెంకట రమణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అమరవీరులకు ఘననివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు జిల్లా అధ్యక్షులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, ఆకుల వెంకటరమణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved