తనయుడు మృతి.. శవం ఇంటికి వచ్చేలోపు తల్లి మరణం

తనయుడు మృతి.. శవం ఇంటికి వచ్చేలోపు తల్లి మరణం

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

కన్న కొడుకు కి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన 24 గంటల లోపు లోనే తల్లి కూడా గుండెపోటుతో మరణించింది కొడుకు చనిపోయాడని గుండెలు అవిసేలా రోదించిన ఓ తల్లి గుండెపోటుతో కన్నుమూసింది. ఈ సంఘటనతో ఏలేశ్వరం లో శుక్రవారం విషాదఛాయలు అలుముకున్నాయి వివరాల్లోకి వెళితేఏలేశ్వరం (మండలం ) లో నెయిలీ పేట కు చెందిన సీతారామ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు పరిస్థితి విషమించడంతో ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో సీతారామ్ ను ఆస్పత్రిలో చేర్చారు సీతారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషయం అతడి తల్లి మంగ (70)కు తెలిసింది. కొడుకు మరణవార్త తెలిసిన ఆమె తల్లడిల్లిపోయింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆ తల్లి తాను బతికి ఉండగానే కొడుకు కన్నుమూయడంతో మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో ఆ తల్లి గుండె ఆగింది. ఇంకా సీతారామ్ మృతదేహం ఇంటికి రాకముందే ఇంట్లో ఉన్న మరో పెద్ద దిక్కు కన్నుమూయడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved