సంక్షేమాభివృద్ధే భాజపా లక్ష్యం..మాజీమంత్రి

సంక్షేమాభివృద్ధే భాజపా లక్ష్యం..మాజీమంత్రి

user-default | Mob: | 20 Oct

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోదీ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్ మాజీ మంత్రి బిజెపి నాయకులు మాణిక్యాలరావు పేర్కొన్నారు. భాజపా ఆరేళ్ల పాలనలో విజయాలు, కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్‌ భారత్‌ కేటాయింపుల వివరాలను మంగళవారం బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షులు చెలుకూరి రామ్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ భానుగుడి సెంటర్లో కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆరేళ్ల పాలనలో ఒక్క మచ్చ కూడా లేదని చెప్పారు. కరోనా కేసులు భారత్‌లో పెరిగినప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాలను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకంలో భాగంగా అయిదు విడతల్లో రూ.వేల కోట్ల లబ్ధి ప్రజలకు చేకూరనుందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడి హయాంలో మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛభారత్‌, నీరు-చెట్టు, గృహ నిర్మాణం వంటి పథకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈఎస్‌ఐ కేసులో రూ.150 కోట్ల అవినీతి జరిగిందని అప్పటి మంత్రిని, డైరెక్టర్లను అరెస్టు చేశారని, రాజమహేంద్రవరం ఆవ భూముల వ్యవహారంలోనూ రూ.150 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని వైకాపా ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి పనుల్లో జగన్‌ ప్రభుత్వం వెనుకంజలో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాలకొండయ్య ,గట్టి సత్యనారాయణ ,సాయి తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved