వైసిపి అవినీతి పాలనపై ప్రజల దృష్టిని దారి మళ్ళించడానికే అక్రమ అరెస్టులు

వైసిపి అవినీతి పాలనపై ప్రజల దృష్టిని దారి మళ్ళించడానికే అక్రమ అరెస్టులు

user-default | Mob: | 29 Oct

మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం  తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు  కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు భౌతిక దూరం పాటిస్తూ ప్లేకార్డుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి భూకబ్జా పాలనపై ప్రజల దృష్టిని దారి మళ్లించడానికే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని  అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కును కాలరాస్తున్నారని  ప్రస్తుతం అధికారంలో ఉన్న  వైసిపి ప్రజాప్రతినిధులపై అనేక  కుంబకోణాలు, భూకబ్జా కేసులు ఉన్నాయని వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీకోటి అప్పలకొండ, కొల్లాబత్తుల అప్పారావు, జోగా రాజు,  గుత్తుల రమణ, అంబటి చిన్నా, తాతాజీ, గుమ్మల చిన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved