జగన్‌ డైరెక్షన్‌లో ఏసీబీ.. రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనం: యనమల

జగన్‌ డైరెక్షన్‌లో ఏసీబీ.. రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనం: యనమల

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

బీసీ నాయకుడు అచ్చెన్నాయుడి ఎదుగుదలను చూసి ఓర్వలేకే సీఎం జగన్‌ కక్షగట్టి ఆయనపై పలు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత లు యనమల రామకృష్ణుడు , ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప వ్యాఖ్యానించారు. కాకినాడ రూరల్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆయనపై కుట్రపూరితంగానే అభియోగం మోపారని, ఏసీబీ పూర్తిగా జగన్‌ డైరెక్షన్‌లోనే పని చేస్తోందని ఆయన విమర్శించారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి తప్పు చేయకపోయినా..కుట్రపూరితంగా అభియోగం మోపారని ఆరోపించారు. అచ్చెన్నాయుడి కుటుంబ నిబద్ధత, నిజాయితీ అందరికీ తెలుసన్నారు. బీసీ సంఘాలన్నీ ఇటువంటి దుర్మార్గాలను ఖండించాలని తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.ఆరోపణలు, ఆధారాలు లేకుండా అచ్చెన్నాయుడిని ఎలా అరెస్టు చేస్తారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. టిడిపి పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు అచ్చెన్నాయుడు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved