నగరంలో కుండపోత

నగరంలో కుండపోత

user-default suresh gona | Mob: 7799146666 | 28 Oct

జిల్లా కేంద్రం కాకినాడలో లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. కురుస్తున్న వర్షానికి పలు రహదారులు జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాలువలు నిండిపోయాయి. సినిమారోడ్డు కూడలి చుట్టూ నీరు చేరింది. ఈ ప్రాంతంలో కాలువలు మూసుకుపోవడంతో నీరంతా రోడ్డెక్కింది. ఏటిమొగ దుమ్ములపేట, సురేష్ నగర్ పద్మావతి నగర్‌ తదితర చోట్ల నీరు నిలిచింది. నగరంలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో గోతులు ఉండడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved