బి ఎల్ సి బిల్లులను మంజూరు చేయాలి

బి ఎల్ సి బిల్లులను మంజూరు చేయాలి

user-default suresh gona | Mob: 7799146666 | 25 Oct

కాకినాడ నగరంలో స్వంత స్థలము ఉండి గృహ నిర్మాణాలు చేపట్టిన వ్యక్తిగత గృహ నిర్మాణ బి ఎల్ సి బిల్లులను మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధికారం కోరారు సోమవారం లబ్ధిదారులతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో స్వంత స్థలము ఉండి గృహనిర్మాణం కొరకు హౌసింగ్ కార్పొరేషన్ బిపి ఎల్ వ్యక్తిగత గృహ నిర్మాణం పదకం నందు దరఖాస్తు చేసుకొని గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ బిల్లులు మంజూరు చేస్తారని ఆశతో చాలా మంది లబ్ధిదారులు అధిక వడ్డీలకు అప్పులు చేసుకొని వివిధ దశలలో గృహ నిర్మాణాలు చేపట్టి హౌసింగ్ బిల్లులు కోసం ఎదురు చూస్తున్నారని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ వ్యక్తిగత హౌసింగ్ పధకం ద్వారా గృహ నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు 2019 మార్చి వరకు హౌసింగ్ బిల్లులు మంజూరు చేయడం జరిగిందిని, కానీ ప్రస్తుత ప్రభుత్వం గత సంవత్సర కాలంగా గృహ నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటివరకు ఎటువంటి రుణ బిల్లులు మంజూరు కాలేదని దీని వలన గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు అధిక వడ్డీల అప్పులు తీర్చలేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వివిధ దశలలో గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు త్వరితగతిన బిల్లులు మంజూరు చేసి వ్యక్తిగత గృహ నిర్మాణ పథ కం లబ్ధిదారులను ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రి శ్రీనివాస్ ఒమ్మ బాలాజీ, తుమ్మల రమేష్, అంబటి చిన్న, చోడు పిల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved