వైన్ షాపులో పనిచేస్తున్న సిబ్బంది కి ఉద్యోగ భద్రత కల్పించాలి

వైన్ షాపులో పనిచేస్తున్న సిబ్బంది కి ఉద్యోగ భద్రత కల్పించాలి

user-default suresh gona | Mob: 7799146666 | 29 Oct

రాష్ట్ర వ్యా ప్తంగా బేవరేజెస్ కార్పొరేషన్ వైన్ షాపులో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు (సూపర్వైజర్ సేల్స్ మెన్ )ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది .ఈ ధర్నాకు యూనియన్ రాష్ట్ర కన్వీనర్ టీ మధు ,ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ నాయకత్వం వహించారు .ముందుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది .ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ రాష్ట్ర కన్వీనర్ టీ మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో లో 33 పర్సంటేజ్ వైన్ షాపులు తొలగించిందని కానీ దానిలో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం ఉద్యోగాలు ఉంటాయో ,అర్థం కాని పరిస్థితి ఉందని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి గారు అవుట్ సోర్సింగ్ సిబ్బంది కి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందర్నీ రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారని ఆ మాట నిలబెట్టుకోవాలని మా జీవితాలను రోడ్లు పలు చేయొద్దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు .ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు హాజరయ్యాఋ .ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాంబాబు ,జి నాగ దుర్గ ప్రసాద్ ,సుధీర్ ,ర్ కిరణ్ కుమార్ ,బైరవ ,స్వామి ,ప్రసాదు ,రాజు ,మణికంఠ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved