జిల్లాలో వర్షాలు ..చల్లబడ్డ వాతావరణం

జిల్లాలో వర్షాలు ..చల్లబడ్డ వాతావరణం

user-default suresh gona | Mob: 7799146666 | 22 Oct

వాతావరణ శాఖ ప్రకటించినట్లుగానే జూన్‌ మొదటి వారం లో తర్వాతే నైరుతి రుతపవనాల ఆగమనం మొదలైంది. గురువారం తొలకరి జల్లులు జిల్లాను పలకరించాయి. మొన్నటి వరకు ఎండల తీవ్రతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఓ మోస్తరుగా వర్షం కురవడంతో అన్నదాత మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. కొందరు రైతులు సాగు పనులు మొదలు పెట్టారు.జిల్లా వ్యాప్తంగా కాకినాడ రాజమహేంద్రవరం తుని మండపేట తదితర ప్రాంతాల్లో వానలు కురిశాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశం మేఘావృత్తం అయింది. ఉదయం8గంటల తర్వాత సన్నగా మొదలైన వాన దాదాపు గంట పాటు ముసురుగా కురిసింది. జిల్లాలో కురిసిన తొలకరి వనాలు కురిశాయి. దీంతో జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాగా ఈ వానలు జిల్లాలో చాలా చోట్ల సాగుకు అనుకూలంగా ఉన్నాయని రైతులు ఆనందిస్తున్నారు. కొందరు రైతులు ఏకంగా సాగు పనులు మొదలు పెట్టారు. చల్లబడ్డ వాతావరణం... నైరుతి రుతుపవనాలు తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మొన్నటి వరకు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో మండించిన ఎండలు తగ్గుముఖం పట్టాయి. జిల్లా వ్యాప్తంగా వానలు కురవడంతో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. జిల్లాలో వర్షం పడకున్నా ఆకాశం మేఘావృత్తం కావడంతో చల్లగాలులు వీచాయి. బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌, అత్యల్పంగా 24 డిగ్రీలు నమోదైంది. దీంతో ఇన్నాళ్లూ ఎండల ప్రతాపానికి అల్లాడిన జనాలు చల్లగాలులుకు ఉపశమనం పొందారు. కాగా కాకినాడ,ఏజెన్సీ లో మండలంలో కొంత మెరుగైన వర్షపాతం నమోదు కాగా మిగిలిన మండలాల్లో ఓ మోస్తరుగా కురిసింది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved