ఆన్ లైన్ లో చి త్రలేఖనం , కార్టూన్స్ పోటీలు

ఆన్ లైన్ లో చి త్రలేఖనం , కార్టూన్స్ పోటీలు

user-default suresh gona | Mob: 7799146666 | 24 Oct

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్ లైన్ లో పర్యావరణంపై చిత్రలేఖనం , కార్టూన్ పోటీలను నిర్వహించారు . జిల్లా విద్యాశాఖ , సమగ్రశిక్ష , గ్రీన్ ఇండియా ఫౌండేషన్ , వి.బి.వి. ఆర్ . చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి . బుధవారం ఈ పోటీలలో గెలుపొందిన విజేతలను జిల్లా , విద్యాశాఖాధికారి ఎస్ . అబ్రహాం ప్రకటించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలలో 2308 మంది విద్యార్ధులు పాల్గొన్నారు . లాక్ డౌన్ సమయంలో పర్యావరణంపై స్పృహను పెంచడానికి ఈ పోటీలు సహకరిస్తాయన్నారు . సమగ్రశిక్ష ఎడిషనల్ ప్రాజెక్టు కో - ఆర్డినేటర్ బి . విజయభాస్కర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంపొందిచుకోవాలని తెలిపారు . ఈ లాక్ డౌన్ వల్ల విజేతలకు ప్రశంసాపత్రాలు ఆన్ లైన్ లో పంపిచడం జరుగుతుందన్నారు . ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి కేసరి శ్రీనివాసరావు , ది గ్రీన్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి కె.వి.కె. మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు . విజేతలు వీరే : కార్టూన్స్ పోటీలలో సీనియర్స్ విజేతలుగా : ప్రథమ బహుమతి - ఎమ్ . రాము , అమలాపురం . ద్వితీయ బహుమతి - సిహెచ్ . వినోద్ కుమార్ ( వినోద్ ) , సఖినేటిపల్లి , తృతీయ బహుమతి - టి . శేషగిరి ( గిరి ) , తుని , కార్టూన్స్ పోటీలలో జూనియర్స్ విజేతలుగా : ప్రథమ బహుమతి - సిహెచ్ . సునేహ ఏంజెల్ , సఖినేటిపల్లి . ద్వితీయ బహుమతి - జి . ప్రణవాక్షరి , శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ , పెద్దాపురం , తృతీయ బహుమతి - జి . రాజు , బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల , సామర్లకోట , చిత్రలేఖన పోటీలలో విజేతలుగా : 5 వ తరగతిలో ప్రథమ బహుమతి - గంధం జైతర ప్రణీత విజేతగా నిలించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved