‘వైకాపా దాడిచేస్తే డయల్‌ 7306299999’ - తెదేపా కార్యకర్తలకు టోల్‌ఫ్రీ నంబర్‌!

‘వైకాపా దాడిచేస్తే డయల్‌ 7306299999’ - తెదేపా కార్యకర్తలకు టోల్‌ఫ్రీ నంబర్‌!

user-default | Mob: | 27 Oct

తెదేపా కార్యకర్తలకు రక్షణగా టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. 7306299999 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు. వైకాపా దాడులకు పాల్పడినా, కేసుల పేరుతో వేధించినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యకర్తలంతా సంయమనం పాటించి.. న్యాయపరంగా ఎదుర్కొందామని లోకేశ్‌ అన్నారు. కార్యకర్తలకు అండదండలిచ్చేందుకు గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక విభాగం నెలకొల్పామని వెల్లడించారు. 30 రోజుల్లో 100 చోట్లకు పైగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడటం దారుణమన్నారు. ఆరుగురిని అత్యంత దారుణంగా చంపడం కిరాతకమని మండిపడ్డారు. బాధిత కుటుంబాలను ఆదుకొనేందుకే ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు లోకేశ్‌ తెలిపారు. ప్రతి జిల్లాలో తెదేపా లీగల్‌ సెల్‌ ఏర్పాటుకు సమాయత్తమవుతున్నట్టు వెల్లడించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved