వైన్ షాప్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను తొలగించే అలోసన మానుకోవాలి

వైన్ షాప్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను తొలగించే అలోసన మానుకోవాలి

user-default suresh gona | Mob: 7799146666 | 20 Oct

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బెవరేజిస్ వైన్ షాపుల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని మద్యం పాలసీ లో భాగంగా రాష్ట్రము లో 13 శాతంషాపులు మూసివేసి వారిని తొలగించడాన్ని నిరసిస్తూ ఐదో తేదీ నుండి తూర్పుగోదావరి జిల్లాలో ఆందోళన బాట సెపటనట్లు రాష్ట్ర నేత తాటిపాక మధు పిలుపునిచ్చారు .బుధవారం సాయంత్రం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బొమ్మిడి రాంబాబు అధ్యక్షతన జరిగింది. ముందుగా మధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర ప్రదేశ్ దేశ్ స్టేట్ బెవరేజిస్ వైన్ షాపుల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకున్నారని నేడు రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ లో భాగంగా ఈ సంవత్సరం 13 శాతం షాపుల్ని తొలగిస్తున్నారని కానీ దాంట్లో పని చేస్తున్న కార్మికులు మాత్రం రోడ్డున పడుతున్నారని ఇది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నామని ఆయన తెలియజేశారు .దీనికి నిరసనగా ఈ నెల 5 నుండి తూర్పుగోదావరి జిల్లాలో మంత్రులు ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని ఆయన కోరారు .ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మద్యం పాలసీ పై నిర్ణయం తీసుకోవడం ఆయనకు హక్కు ఉందని అదేవిధంగా ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న కార్మికులు ను వేరే డిపార్ట్మెంట్ లో నింపాలని అవసరం అనుకుంటే రైతు భరోసా కేంద్రం ,సచివాలయం ఇలాంటి వాటిలో నియమించాలని లేకుంటే వేలాది మంది రోడ్డున పడతారని ఆయన అన్నారు కావున ఈనెల 5న నుండి జరిగే ఆందోళన కార్యక్రమానికి జిల్లాలో వైన్ షాపులో పనిచేస్తున్న సిబ్బంది అందరూ జయప్రదం చేయాలని అయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రసాదు ,రాజు ,బాబి ,చందు ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved